అమెరికా ఎలక్షన్స్​లో ఈవీఎంలు వద్దు : ఎలాన్ మస్క్‌

-

పోలింగ్‌ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)ల వినియోగంపై ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్‌ఎక్స్ చీఫ్ ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్ సమయంలో ఈవీఎంలు హ్యాకింగ్‌కు గురవ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు.. ఈ క్రమంలో ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడంతో హ్యాకింగ్‌ను నివారించొచ్చని వ్యాఖ్యానించారు.

అమెరికా నియంత్రణలోని ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ తాజాగా ఆ వ్యవహారంపై స్పందిస్తూ యూఎస్ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించాలని అన్నారు. వీటిని వ్యక్తులు లేదా ఏఐ(AI) సాయంతో హ్యాక్‌ చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలా జరిగితే దేశానికి నష్టాన్ని కలిగిస్తుంది మస్క్ ఎక్స్​లో ఓ పోస్టు పెట్టారు. మరోవైపు ప్యూర్టో రికోలో ఇటీవల తలెత్తిన ఎన్నికల వివాదాల కారణంగా అక్కడి అధికారులు ఈవీఎంల భద్రతపై దృష్టి సారించారు.

Read more RELATED
Recommended to you

Latest news