కృష్ణా డెల్టాకు సాగు, త్రాగునీరు విడుదల చేసిన మంత్రి నిమ్మల..!

-

ఆంధ్రప్రదేశ్  మంత్రి నిమ్మల రామానాయుడు ఇవాల కృష్ణా డెల్టాకు తాగు, సాగు నీటిని విడుదల చేశారు.  పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా నీరు విడుదల చేసిన అనంతరం మంత్రి నిమ్మల ఎత్తిపోతల దగ్గర మోటార్లు, యంత్రాలకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, ధర్మరాజు, కలెక్టర్ హాజరై ఎత్తిపోతల మోటార్లు ఆన్ చేసి పోలవరం కుడికాలువకు నీరు విడుదల చేశారు. 4, 5, 6 పంపుల ద్వారా 1, 050 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. అనంతరం మంత్రి నిమ్మల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరవురహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని వెల్లడించారు. పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతుందనే కారణంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు చేపట్టారని తెలిపారు. పట్టిసీమ పథకం బంగారు పథకంగా మారిందని నిమ్మల గర్వంగా చెప్పుకొచ్చారు. ఏటా 10 లక్షల ఎకరాలకు సాగు, వేలాది గ్రామాలకు తాగునీరు ఇస్తున్నామని అన్నారు. ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు ద్వారా 35 టీఎంసీల నీరు నిల్వ ఉంచే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు కేవలం అర టీఎంసీ నీరు మాత్రమే నిల్వ ఉందని మంత్రి నిమ్మల రామా నాయుడు చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news