రాష్ట్ర ఆర్ధిక స్ధితి మెరుగు పరచడానికి కావాల్సిన పాలసీలు ఆమోదించారు. గ్లోబల్ కాంపిటీటివ్ సెంటర్స్ పాలసీని కేబినెట్ ఆమోదించింది అని మంత్రి పార్థసారథి తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి, ఎకానమీ, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అభివృద్ధి కి గ్లోబల్ కాంపిటీటివ్ సెంటర్స్ పాలసీ ఉపయోగపడుతుంది. ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఆలోచన సిఎం చంద్రబాబుది. MNC లలో పని చేస్తున్నారు చాలామంది.. కానీ ఇళ్ళవద్దే పని చేస్తున్నారు. కోవర్కింగ్ స్పేస్ డెవలప్ చేస్తే.. వారికి ఇన్సెంటివ్ ఇస్తాం. నైబర్ హుడ్ వర్కింగ్ స్పేస్ ను కూడా డెవలప్ చేయచ్చు.
కోవర్కింగ్ స్పేస్ డెవలపర్స్ కి 50% కాస్ట్ లో సబ్సిడీ ఇస్తాం.. సీటుకు 2000 రూపాయలు ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది.గ్రామాలలో 1000 స్క్వేర్ ఫీట్ లో కోవర్కింగ్ స్పేస్ ఉంటే వారికి 1000 రూపాయలు ఓ సీటుకు ఇస్తాం. ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేస్తే 50% కేపిటల్ సబ్సిడీ ఇస్తాం. రాష్ట్రాన్ని ఐటీ హబ్ గా అభివృద్ధి చేయాలి. యువతకు ఉపాధి భరోసా కల్పించడానికి ఈ పాలసీ.. అపారల్ & గార్మెంట్స్ పాలసీ ని కూడా కేబినెట్ ఆమోదించింది. వచ్చే ఐదేళ్ళలో 10వేల కోట్ల పెట్టుబడి, 6 లక్షల ఉద్యోగాలు తేవాలని ఆలోచన ఉంది. PPP మోడ్ లో 5 టెక్స్ టైల్ పార్కులు ఏర్పాటు చేస్తాం. ఏపీ మేరీటైం పాలసీని కూడా కేబినెట్ ఆమోదించింది అని మంత్రి పార్థసారథి తెలిపారు.