అమరావతి నిర్మాణం కోసం 11 వేల కోట్ల రుణం మంజూరుకు హామీ..!

-

ఏపీ మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (HUDCO- హడ్కో) అధికారులతో సమావేశమయ్యారు మంత్రి నారాయణ,మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్. ఈ సమావేశంలో హడ్కో సీఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠ,హడ్కో విజయవాడ రీజినల్ చీఫ్ బీఎస్ఎన్ మూర్తి పాల్గొన్నారు.

అయితే అమరావతి నిర్మాణం, నెల్లూరులో అభివృద్ధి కార్యక్రమాలకు హడ్కో నుంచి ఋణసదుపాయం పై చర్చ సాగింది. అమరావతి నిర్మాణంలో ప్రభుత్వ ఆలోచన విధానాన్ని హడ్కో అధికారులకు వివరించిన మంత్రికి.. అమరావతి నిర్మాణం కోసం ఏపీ సీఆర్థీయే కు 11000 కోట్ల రుణం మంజూరుకు హామీ ఇచ్చారు అధికారులు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పలు అభివృద్ధి పనులకు గత YCP ప్రభుత్వం నిర్లక్ష్యంతో పెండింగ్ లో ఉన్న 165 కోట్లు రుణం విడుదలకు అంగీకరించిన హడ్కో.. వారం రోజుల్లో లోన్ ప్రక్రియ ప్రారంభిస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news