చలాన్ల విషయంలో ఆటో డ్రైవర్లకు మంత్రి రజినీ కీలక హామీ..!

-

ఆటో డ్రైవర్లకు ఎలాంటి సమస్యలు రానీయకుండా చూడాలని అధికారులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని ఆదేశించారు. గుంటూరులోని స్థానిక చంద్రమౌళి నగర్ కార్యాలయంలో మంత్రి ఆటో డ్రైవర్ల సమస్యలపై రోడ్డు రవాణా అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి విడుదల రజిని మాట్లాడుతూ.. పాత చలాన్ల చెల్లింపు విషయంలో కొంత వరకు గడువు ఇవ్వాలని కోరారు.

సిగ్నల్ వయోలేషన్ విషయంలో నిబంధనలను అనుసరించాలని.. చిన్న చిన్న వాటికి కూడా జరిమానాలు విధించే పరిస్థితులు ఉండకూడదని కోరారు. పోలీసు రోడ్డు రవాణా అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని సూచించారు. ఆటో డ్రైవర్ల విషయంలో అనవసరపు ఇబ్బందులు రాకుండా చూస్తామని అధికారులు మంత్రి సమక్షంలో ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news