కేంద్ర బడ్జెట్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ రాజకీయ ప్రేరేపితమైందని.. ప్రజల కోసం పెట్టినది  కాదని విమర్శలు గుప్పించారు.

ఎన్డీఏ కూటమిలో కీలకమైన టీడీపీ, జేడీయూ పార్టీలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రవేశపెట్టిన బడ్జెట్ గా అభివర్ణించారు. బీహార్ కి రూ.41 వేల కోట్ల ఆర్థిక సహాయం.. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్ల నిధులు, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడానికి నిధులు కేటాయించి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం హామీలను తప్పనిసరిగా అమలు చేయాలని మంత్రి ఉత్తమ్  డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version