జగన్ కు దిశ చట్టం గురించి మాట్లాడే హక్కు లేదు : వాసంశెట్టి సుభాష్

-

జగన్ దిశ చట్టం గురించి మాట్లాడుతూ లోకేష్‌, హోమంత్రి గురించి మాట్లాడారు. కానీ ఆయనకు ఆ హక్కు లేదు. అసలు దిశాచట్టం అమలులో ఉందా వైసిపి హయాంలో ఎన్ని ట్రయిల్స్ జరిపారు. ఎంత మందికి శిక్ష వేశారు అని ప్రశ్నించారు మంత్రి వాసంశెట్టి సుభాష్. అసలు దిశకు దిశానిర్ధేశం ఏమైనా ఉందా.. ఒక అమ్మాయి బలైనప్పుడు 7 రోజుల్లోగా ఎంక్వైరీ అయిపోవాలి. 14 రోజుల్లో చార్జి షీట్ వేయ్యాలి.. ఇలా ఒక్క కేసు అయినా ఇన్వెస్టిగేషన్ చేయగలిగారా. 2023లో భారతీయ న్యాయ సంహిత అమలు లోకి వచ్చాక కఠిన మయిన శిక్షలు ఇలాంటి నేరాలకు అందులో పొందు పర్చారు.

ఒక సారి చంద్రబాబును జైల్లో పెట్టినందుకు ఏమైందో మీకు ఇంకా తెలిసి రాలేదా. కార్మిక శాఖలో అయిదు సంవత్సరాలు గత ప్రభుత్వ నిర్వాకంతో కేంద్రం నిధులు వెనెక్కి వెళ్లిపోయాయి. చంద్రబాబు మొదటి మీటింగ్ లోనే కక్షసాధింపులు ఉండవు అన్నార. మహిళలను ఇబ్బంది పెడుతూ పోస్టులు పెట్టేవారిని ఉపేక్షించేది లేదని సీఎం స్పష్టం చేశారు అని వాసంశెట్టి సుభాష్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news