సాధారణంగా ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా నల్లమల్ల అడవుల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున-బ్రమరాంభ స్వామి వార్లను దర్శించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా వస్తుంటారు. ఏపీలో తిరుపతి తరువాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న దేవాలయం కూడా శ్రీశైలమే. అయితే తాజాగా శ్రీశైలం పాతాళగంగ వద్ద ఓ అద్భుత దృశ్యం దర్శనమిచ్చింది. పాతాల గంగ వద్ద నాగుపాము చంద్రలింగాన్ని చుట్టుకొని ఉండటం కనిపించింది.
ముఖ్యంగా శ్రీశైలం భక్తులతో ఎల్లప్పుడూ కిటకిటలాడుతోంది. శ్రీశైలంలో పాతాల గంగ వద్ద చంద్ర లింగేశ్వర స్వామి ఉంది. అక్కడ కూడా ప్రతి రోజు భక్తులు పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఆలయ ప్రాంగాణాన్ని శుభ్రం చేసి పూజలు చేశారు. అనంతరం ఓ పెద్ద నాగుపాము అక్కడికి వచ్చి చంద్ర లింగాన్ని చుట్టుకొని కనిపించింది. ఇది చూసిన భక్తులు మల్లికార్జుని వద్దకు వాసుకి స్వయంగా వచ్చింది చేరుకుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలుసుకున్న శ్రీశైల భక్తులు.. ఈ అద్భుతాన్ని చూసేందుకు ఎగబడ్డారు. దీనిపై భక్తులు ఈ పరిసరాల్లో పాములు తిరుగుతుంటాయి కానీ ఇలా ఎప్పుడు జరగలేదని అంటున్నారు.