వైసీపీ దొంగ కంపెనీలను అనుమతించేది లేదు : ఆదినారాయణ రెడ్డి

-

జమ్మలమడుగులో అదానీ పేరు చెప్పి వైసీపీ వాళ్ళు అక్రమాలకు పాల్పడుతున్నారు. నిన్న జరిగిన గొడవ అలాంటి వైసీపీ వాళ్ల మీదే తప్ప అదానీ తో కాదు అని జమ్మలమడుగు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేసారు. ఇక మేము అదానీ సంస్థను జమ్మలమడుగు కు స్వాగతిస్తున్నం. కానీ అదానీ పేరు చెప్పుకుని వచ్చే దొంగ వైసీపీ కంపెనీలను అనుమతించేది లేదు అని ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రంలో అతి పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ తో పాటు సోలార్ పరిశ్రమ ఏర్పాటుకు అదానీ సంస్థ మొగ్గు చూపుతోంది అని పేర్కొన జమ్మలమడుగు ఎమ్మెల్యే.. అదానీ పరిశ్రమలకు సబ్ కాంట్రాక్టర్లు గా చలామణీ అవుతూ వైసీపీ వాళ్లు తెరిచిన దొంగ దుకాణాలనే మా వాళ్లు అడ్డుకున్నారు అని అన్నారు. అయితే మేము అదానీ గ్రూప్ తో దగ్గర ఉండి పరిశ్రమలు మేమే పెట్టిస్తాం కానీ, వైసీపీ అనవసర జోక్యాన్ని మాత్రం సహించలేం అని తెలిపిన ఆదినారాయణ రెడ్డి.. అదానీ ముసుగులో రెచ్చగొట్టిన వైసీపీ నేతల వల్లే నిన్న ఘర్షణ చెలరేగింది అని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news