ఆర్పీ ఠాకూర్, యోగా నంద్, ఏబీ వెంకటేశ్వర రావు వంటి రిటైర్డు అధికారుల బృందంతో చంద్రబాబు సమావేశాలు నిర్వహిస్తున్నారు అని మాజీ సీఎం వైస్ జగన్ పేర్కొన్నారు. చంద్రబాబుకి వ్యతిరేకంగా గళం ఎత్తిన వారిపై కేసులు పెట్టడం, జిల్లా ఎస్పీ లతో ఫాలో అప్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు పోలీసులు కేసులు పెట్టరు కదా అని ప్రైవేట్ మాఫీయా ను నడుపుతున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారికి కొట్టి వీడియోలు తీసి వాటిని పైనున్న వారికి పంపి సాడిజంగా చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సినీ దర్శకుల పరిస్థితి కూడా ఇలానే ఉంది అని పేర్కొన్నారు.
అయితే వివేకం అని వీళ్ళు సినిమాలు తీయచ్చు. కానీ సెన్సార్ బోర్డు అప్రూవల్ ఇచ్చిన సినిమా తీసిన ఆర్జీవీ పై కేసులు పెడుతున్నారు. దళిత మాజీ ఎంపీ నందిగామ సురేష్ 60 రోజులుగా జైల్లో ఉన్నారు. టీడీపీ ఆఫీసు పై దాడి చేశారనీ సురేష్ ను అరెస్టు చేసారు. అని అసలు ఆ సమయంలో సురేష్ ఊరులో కూడా లేడు. ఇక లక్ష్మీ పార్వతి మొదలు నా వరకు అందరి క్యారెక్టర్ పై ఎన్నో విమర్శలు చేయించాడు చంద్రబాబు అని ys జగన్ అన్నారు.