నారా లోకేష్ కి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్

-

టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కి సవాల్ విసిరారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. లోకేష్ యువగళం పాదయాత్రలో వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లోకేష్ చేసేది పాదయాత్ర కాదని.. అదో విహారయాత్ర అని వ్యాఖ్యానించారు. జగన్ పాదయాత్ర చేస్తే ఉదయం నుండి రాత్రి వరకు చేశారని.. లోకేష్ లాగా నాలుగు గంటల తర్వాత కాసేపు నడిచి కాలయాపన చేయలేదని అన్నారు. లోకేష్ మాట్లాడే ముందు భాష నేర్చుకోవాలని హితవు పలికారు.

ఆయనకి నిజంగానే దమ్ముంటే జిల్లాలో అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. సమయం, వేదిక మీ ఇష్టమని.. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎవరి హయాంలో జరిగాయో తెలుసా..? అని ప్రశ్నించారు. జిల్లాలో పెన్నా నదిపై సంఘం, నెల్లూరు బ్యారేజీలు ఎవరు పూర్తి చేశారో తెలుసా..? నెల్లూరు సిటీలో చర్చకు సిద్ధమని.. దమ్ముంటే రావాలని లోకేష్ కి ఛాలెంజ్ విసిరారు. నోటికి వచ్చినట్టు జగన్ పై మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీని వీడినంత మాత్రాన ఏం కాదని.. వాళ్లు వైసీపీలో కలుపు మొక్కల లాంటి వారని అన్నారు. అందుకే పీకి పారేశారని కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news