మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి NDA పక్షాల సీట్ల పంపకం జరిగింది. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీయే కూటమికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో కీలక సమావేశం జరిగింది.
తాజాగా జరిగిన ఈ సమావేశంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సహా కీలక వ్యక్తులు పాల్గొన్నారు. మూడు పార్టీలు గతంలో 240 సీట్లపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ పొత్తులో భాగంగా 151 స్థానాల్లో పోటీ చేయనుంది బీజేపీ. 84 స్థానాల్లో శివసేన (షిండే) పోటీలో ఉంటుంది. ఎన్‌సీపీ (అజిత్‌పవార్)కు 53 స్థానాలు కేటాయించారు.