క్యాలెండర్ లో పేజీలు మారినట్లు షర్మిల పార్టీలు మారుతుంది – వైసీపీ ఎమ్మెల్యే

-

క్యాలెండర్ లో పేజీలు మారినట్లు షర్మిల పార్టీలు మారుతుందని వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శలు చేశారు. షర్మిల నిన్న మాట్లాడిన మాటలు విడ్డురంగా ఉన్నాయి…రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అక్రమంగా 15 రోజులు జైలులో పెట్టిందని తెలిపారు. రాజశేఖర్ రెడ్డిని అవమానకరంగా మాట్లాడినందుకు అసెంబ్లీలో వివేకా చేయి చేసుకున్నాడు….రాజశేఖర రెడ్డిని, జగన్ ను కాంగ్రెస్ పార్టీ అక్రమంగా కేసులో పెట్టి జైలుకు పంపిందని వెల్లడించారు.

MLA Rachamallu Sivaprasada Reddy’s criticism of Sharmila

కాంగ్రెస్ పార్టీలో చేరి నువ్వు నైతికంగా చనిపోయావు….కడప ఎంపీ గా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డికి ప్రజా కోర్టులో ఓటమి చెందినా,కోర్టులో నేరం రుజువు అయినా నేను రెఫరెండంగా భావించి రాజకీయాల నుండి నిష్క్రమిస్తానని సవాల్‌ చేశారు. క్యాలెండర్ లో పేజీ మారే లోపు షర్మిల పార్టీ మార్చావు…మేము నిన్ను రాజశేఖర్ రెడ్డి బిడ్డగా స్వీకరించడం లేదు,నువ్వు రాజశేఖర్ రెడ్డి బిడ్డవు కాదు,జగన్ ఒక్కడే రాజశేఖర రెడ్డి బిడ్డ అంటూ వ్యాఖ్యానించారు. నువ్వు తెలంగాణ ఆడబిడ్డవు… ఆ మాట నువ్వే చెప్పావని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news