కేసీఆర్ అంటే నీళ్లు ..కాంగ్రెస్ అంటే కన్నీళ్లు అన్నారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. సాగునీరు అందక రైతులు సతమతమవుతున్నారు…తాగునీరు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మళ్ళీ మళ్ళీ చెపుతున్నా ఇది 100% కాంగ్రెస్ వైఫల్యం వల్ల వచ్చిన కరువు….కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కరువు అంటూ వ్యాఖ్యానించారు. ఖైరతాబాద్, స్టేషన్ ఘన్‌పూర్ లలో ఉప ఎన్నికలు వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవాళ తెలంగాన భవన్ లో కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవులు ఖచ్చితంగా పోతాయి…ఖైరతాబాద్, ఘనపూర్ లలో ఉప ఎన్నికలు వస్తాయన్నారు. ఈ ఆదివారం లోపు స్పీకర్ తేల్చకుంటే.. కోర్టు కు పోతాము… సుప్రీంకోర్టు తీర్పు కూడా అనర్హత వేయలని ఉందని గుర్తు చేశారు కేటీఆర్. కాంగ్రెస్ కు హైదరాబాద్ ఓటు వేయదు, అది అందరికీ తెలుసు, అందుకే హైదరాబాద్ లో ప్రజలపై కక్ష కట్టావా అంటూ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్ల ట్యాంకర్ పంపుతున్న మమ్మల్ని మెచ్చుకోరా అంటున్నాడు..ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలా ఇవి అంటూ ఫైర్ అయ్యారు.