ఏపీకి కేంద్రం షాక్‌…ప్రత్యేక హోదా ఇచ్చేదే లేదని ప్రకటన

-

ఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి మరోసారి కేంద్ర ప్రభుత్వం నిరాశే మిగిల్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మరోసారి తేల్చేసి చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై లోక్‌సభ లో వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం జవాబు చెప్పింది. ప్రత్యేక హోదా పై 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయలేదని కేంద్రమంత్రి నిత్యానందరాయ్‌ స్పష్టం చేశారు.

andhra-pradesh

ఏపీ విభజన చట్టంలోని చాలా హామీలు నెరవేర్చామన్న నిత్యానందరాయ్…ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలేమని.. అది సాధ్యం కాని విషయం అని తేల్చి చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అనే చాలా సున్నీతమైన అంశమని.. ఇప్పటికే కేంద్రం దానికి చాలా సార్లు ప్రకటన చేసిందని.. ఆయన గుర్తు చేశారు. కాగా.. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన సమయంలోనే.. అప్పటి యూపీఏ సర్కార్… ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని.. ప్రకటన చేసింది. దీంతో అప్పటి నుంచి అది.. ప్రకటన లాగే ఉండి పోయింది.

Read more RELATED
Recommended to you

Latest news