రైతుల ఖాతాల్లో 48 గంటల్లో డబ్బులు జమ : మంత్రి అచ్చెన్నాయుడు

-

సాధారణంగా పంటను కొనుగోలు చేస్తే.. రోజుల తరబడి రైతులు ఇబ్బందులు ఎదుర్కునే వారు. ముఖ్యంగా ఏపీలో వైసీపీ హయాంలో ధాన్యం సేకరణ అస్తవ్యస్తమైందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఎలాంటి నిబంధనలు అడ్డు లేకుండా రైతులు ధాన్యాన్ని అమ్ముకోవచ్చని తెలిపారు.

పంటను కొనుగోలు చేసిన 48 గంటల్లోనే అన్నధాతల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని పునరుద్ఘాటించారు. రైతుల నుంచి ప్రతీ గింజ కొంటామని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వారి ఇబ్బందులను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. అస్సలు ఆలస్యం చేయకుండా కేవలం 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో పంట కొనుగోలు డబ్బులను జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news