నెల్లూరులో విషాదం..పెళ్లికి ఒప్పుకోలేదని…తల్లీ, కూతుళ్లపై కత్తితో దాడి

-

నెల్లూరులో విషాదం చోటు చేసుకుంది. పెళ్లికి ఒప్పుకోలేదని…తల్లీ, కూతురులపై కత్తితో దాడి చేశాడు ఓ దుర్మార్గుడు. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి పరిధిలోని వింజమూరు మండలం పాతూరులో పెళ్లికి నిరాకరించడంతో తల్లీ, కూతురులపై కత్తితో దాడి చేశాడు ఓ యువకుడు.

Mother and daughters attacked with knife for refusing to marry

ఈ సంఘటనలో తల్లీ, కూతురు ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అసుపత్రికి ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఆ యువతికి వివాహ సంబంధాలు చూస్తుండటంతో తీవ్రంగా ఆగ్రహించిన నాగార్జున.. పూజిత ఇంటికి వెళ్లి ఆమె పై కత్తితో దాడి చేశాడు. కూతురిని కాపాడేందుకు ప్రయత్నించిన తల్లి మంగమ్మపై కూడా దాడి చేయడంతో ఇరువురికీ తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news