మరోసారి CBI విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి

-

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన మాజీ మంత్రి వైఎస్​ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఇంకా సాగుతోంది. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణలో ఇప్పటికే పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక ఇటీవల తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఇవాళ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు.

హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​లోని తన నివాసం నుంచి అవినాష్​ రెడ్డి సీబీఐ కార్యాలయానికి బయలుదేరారు. ఇప్పటికే పలుమార్లు సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి.. తల్లి ఆరోగ్యం బాగాలేదని, సీబీఐ విచారణకు రాలేనని పలుసార్లు కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులకు లేఖలు రాశారు. అంతేకాకుండా అరెస్టు చేయకుండా ఉండేందుకు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్​ పిటిషన్​ను దాఖలు చేశారు. దానిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. అవినాష్​కు ముందస్తు బెయిల్​ మంజూరు చేస్తూ గత నెల మే 31న తీర్పు వెలువరించారు.

అలాగే ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ సీబీఐ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణకు అవినాష్‌రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో తన ఇంటి నుం న్యాయవాదులతో కలిసి సీబీఐ కార్యాలయానికి వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news