శభాష్… పేరు మార్చుకునేందుకు సిద్ధమయ్యారు ముద్రగడ పద్మనాభం. ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం లో పవన్ కళ్యాణ్ గెలిస్తే.. పేరు మార్చుకుంటానని సవాల్ విసిరి.. ఇప్పుడు పేరు మార్చుకునేందుకు సిద్ధమయ్యారు ముద్రగడ పద్మనాభం. నా పేరు పద్మనాభ రెడ్డి గా మార్చమని గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్లు రెడీ చేసుకున్నానని ప్రకటించారు.

సవాలులో నేను ఓడిపోయాను కాబట్టి నా పేరు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నాను అంటూ వ్యాఖ్యానించారు ముద్రగడ పద్మనాభం. జగన్ కోసం కష్టపడ్డాను…. జగన్ ను గౌరవించకపోవడం బాధాకరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ పద్మనాభం. నా రాజకీయ ప్రయాణం జగన్ తోనే కొనసాగుతుంది… జగన్ సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు ఆదరించలేదో తెలియడం లేదని వివరించారు. కూటమికి నా శుభాకాంక్షలు అంటూ వ్యాఖ్యానించారు ముద్రగడ పద్మనాభం.