BREAKING: మొదలైన నల్లగొండ – ఖమ్మం – వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

-

నల్లగొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉపఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. నల్గొండ జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ గోడౌన్లో కౌంటింగ్ కోసం 4 హాల్స్ లలో 96 టేబుల్స్ ఏర్పాటు చేశారు అధికారులు. 52 అభ్యర్థులకు గాను 3,036,13 ఓట్లు పోల్ అయ్యాయి.

Nalgonda – Khammam – Warangal MLC election counting etc

ఎనిమిది గంటల నుండి బ్యాలెట్ పేపర్లు కట్టలు కట్టే ప్రక్రియ ప్రారంభం అయింది. మధ్యాహ్నం తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమయే అవకాశం ఉంటుంది. కాగా, శాసనసభ ఎన్నికల్లో జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల స్థానం ఖాళీ అయింది. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో మే 27వ తేదీన ఉపఎన్నిక జరిగింది. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్‌ అభ్యర్థిగా రాకేశ్‌రెడ్డి, బీజేపీ నేత ప్రేమేందర్ ఎన్నికల బరిలో నిలవగా, వీరితోపాటు మరో 49 మంది పోటీలో నిలిచారు. ఈ ఉపఎన్నికలో 72.44 శాతం పోలింగ్‌ నమోదైంది.

Read more RELATED
Recommended to you

Latest news