హాస్యాస్పదం: బాబుల నోట వ్యవసాయం మాట!

-

ఈ మధ్యకాలంలో జగన్ సాయం చేయలేదు అని భావిస్తూ… కొన్ని రంగాలకు చెందిన వారిని, గుర్తించడం సాధ్యంకాని మరికొన్ని రంగాలవారినీ ప్రస్థావిస్తూ… వారికి రూ. 5 వేలు ఇవ్వండి.. రూ. 10000 ఇవ్వండీ అంటూ నారా లోకేష్ ఒకవైపు, చంద్రబాబు మరోవైపు.. ఏపీ సర్కార్ కు లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నారా లోకేష్ రాసిన ఒక లేఖపై తనదైన మార్కు సెటైర్లు వేశారు వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి! లోకేష్ మాటల్లో ఏది అసత్యమో, మరేది హాస్యాస్పదమో ఆయన వివరించారు.

విషయంలోకి వెళ్తే… వ్యవసాయ రంగం కుదేలు అయిపోయిందని, రైతుకు గిట్టుబాటు ధర లభించలేదని, మద్దతు ధర లేక రైతు ఇబ్బందిపడుతున్నాడని, ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిందని… ఇలా వరుసపెట్టి లేఖలు రాసేస్తున్నారు లోకేష్ & బాబు! దీంతో సమాధానంగా మైకందుకున్న నాగిరెడ్డి… దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ లో ప్రభుత్వ అధికారులే వ్యవసాయ ఉత్పత్తులను కొలుగోలు చేసి.. మద్దతు ధర కల్పిస్తున్నారని నాగిరెడ్డి స్పష్టం చేస్తున్నారు! రైతుకు ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ రైతు బజార్లను ఇప్పటికే ఏర్పాటు చేశామని చెబుతున్న ఆయన… రైతు పంటలకు మద్దతు ధర లేదని టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.

ఇదే క్రమంలో చంద్రబాబు ఎగ్గొట్టిన రూ. 1100 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని సీఎం జగన్ ఇచ్చారన్న విషయం ఎవరూ మరిచిపోలేదని గుర్తుచేసిన ఆయన… జగన్ పాలనలో 14.70శాతం ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని పేర్కొన్నారు. ఇదే క్రమంలో 2019-20 సంవత్సరంలో పంటల దిగుబడి అధికంగా ఉందని నాగిరెడ్డి స్పష్టం చేశారు. అలాగే… వ్యవసాయం అంటే ఏమిటో తెలియని లోకేష్ కూడా వ్యవసాయం గురించి లేఖలు రాయడం హాస్యాస్పదం కాక మరేమిటని ప్రశ్నిస్తున్న నాగిరెడ్డి… చంద్రబాబు పాలనలో తన కేబినెట్ లో ఏనాడూ వ్యవసాయం గురించి చర్చించలేదని స్పష్టం చేశారు!

Read more RELATED
Recommended to you

Latest news