రామోజీరావు, చంద్రబాబు రాసిస్తే, వారాహి ఎక్కి పవన్ చదువుతాడని విమర్శలు చేశారు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్. వాలంటీర్లు కష్టపడి పనిచేస్తుంటే చంద్రబాబు. పవన్ కళ్యాణ్ లకు వాలంటీర్లు వేరుగా కనిపిస్తున్నారని… వాలంటీర్ల పై ఏదో ఒక నెపం వేసి పక్కన పెట్టాలని కుట్ర జరుగుతోందని ఫైర్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ముఖ్యమంత్రి చొరవ తీసుకుని కొన్ని బిల్లులు మంజూరు చేశారన్నారు.
మా పార్టీ నాయకులు కార్యకర్తలు.. సంతోషంగా లేరు.. ఇబ్బందులో ఉన్నారన్నారు. సంతోషంగా ఉండేది చంద్రబాబు.. ఆయన కుమారుడు..పవన్ కళ్యాణ్ లు మాత్రమే అంటూ ఫైర్ అయ్యారు. టిడిపి నాయకులు.. కార్యకర్తలు సంతోషంగా ఉన్నారా…చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టిడిపి నాయకులకు కార్యకర్తలకు న్యాయం చేయలేదన్నారు. చంద్రబాబు కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే లబ్ది పొందారు..జగన్ నిజస్వరూపాన్ని ఎస్సీ.. ఎస్టీలు గ్రహించారని చంద్రబాబు అన్నారన్నారు. మా నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత…నవరత్నాలు పేరుతో సంక్షేమ పథకాలు ఇచ్చారని..ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనార్టీలు అన్ని పార్టీల వారు లబ్ది పొందారని వివరించారు నల్లపరెడ్డి.