దోచుకుని దాచుకునే అలవాటు చంద్రబాబుకు లేదు : నారా భువనేశ్వరి

-

రాష్ట్రాన్ని, ప్రజలను దోచుకుని దాచుకునే అలవాటు చంద్రబాబు నాయుడికి లేదని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని.. ఈ విషయం ప్రజలందరికీ తెలుసని తెలిపారు. ప్రజల సొమ్ము దోచుకుని దాచుకునే అలవాటు చంద్రబాబుకు లేదని స్పష్టం చేశారు.

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని నారా భువనేశ్వరి సందర్శించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు ఏం తప్పు చేశారని 19 రోజులుగా జైలులో నిర్బంధించారని ప్రశ్నించారు. ఎలాంటి విచారణ లేకుండానే నిర్బంధిస్తారా? ఆరోపణల్లో వాస్తవాలేంటో తెలుసుకోరా? అని నిలదీశారు.

ఇప్పటివరకు ఆయన ఏం తప్పు చేశారో చెప్పలేకపోయారని.. ఏ ఆధారాలూ చూపించలేకపోయారని భువనేశ్వరి అన్నారు. స్కిల్ డెవలప్​మెంట్ కేంద్రంలో శిక్షణ పొందిన యువత రూ.లక్షలు సంపాదిస్తున్నారని.. చేయి చేయి కలిపి చంద్రబాబుకు అండగా నిలుద్దామని భువనేశ్వరి టీడీపీ కార్యకర్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news