వైసిపి ప్రభుత్వం పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. నేడు ఏలూరు జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన చంద్రబాబు మాట్లాడుతూ.. రైతుల బాధ చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందన్నారు. 60% ధాన్యం పొలాలలోనే ఉందని.. చేతకాని దద్దమ్మ సీఎంగా ఉన్నారని మండిపడ్డారు. రైతులను సీఎం, మంత్రులు ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు.
ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా అని నిలదీశారు. ధాన్యం సంచులు ఇవ్వలేని ప్రభుత్వాన్ని ఏమనాలని.. నాలుగేళ్లలో జగన్ ఎప్పుడైనా పొలంలోకి దిగారా..? అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. గతంలో హుద్ హుద్ తుఫాన్ సమయంలో తాను అహర్నిశలు పనిచేసినట్లు వెల్లడించారు. కానీ తుఫాన్ వస్తే జగన్ అటువైపు కూడా చూడడం లేదని విమర్శించారు.