ఆంధ్రప్రదేశ్లో అవినీతిని అంతం చేయాలన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఆంధ్రప్రదేశ్ లో 70% ప్రజలు తనని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని అన్నారు. ఏపీ ప్రజలు తనను ముఖ్యమంత్రిగా గెలిపిస్తే త్వరలో 8 లక్షల కోట్లు రాష్ట్రానికి తీసుకువస్తానన్నారు కేఏ పాల్. సిట్ ను అవినీతిపై విచారణకు ఆహ్వానించడం హర్షనీయమన్నారు. కానీ గత నాలుగేళ్లుగా సిట్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.
మంత్రి బొత్స సత్యనారాయణ కు లక్ష కోట్ల విలువైన ఆస్తులు వచ్చాయని.. ఆయనపై కూడా సిట్ తో విచారణ జరిపించాలన్నారు. కేజ్రీవాల్ ను ఢిల్లీ ప్రజలు గెలిపించారని.. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన తనను ఏపీ ప్రజలు ఎందుకు గెలిపించరని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏపీని మింగేస్తాడని బిజెపి పెద్దలకు చెప్పానని అన్నారు. వైసీపీలో కూడా అవినీతిపరులందరినీ విచారించాలని డిమాండ్ చేశారు. వైసిపి పాలనలో ఆదాయం పెరగలేదు కానీ అక్రమాలు, అప్పులు మాత్రం పెరిగాయని ఎద్దేవా చేశారు.