కుప్పం జోలికి వస్తే తాటతీస్తాం – నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు కుప్పం పర్యటనలో తీవ్ర అదృక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ ని ధ్వంసం చేశారు వైసిపి పార్టీ కార్యకర్తలు. దీంతో కుప్పంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఘటనల పై స్పందించారు టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్. ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ స్పందిస్తూ.. కుప్పం జోలికి వస్తే వైసిపి అల్లరిమూకల తాటతీస్తాం అంటూ హెచ్చరించారు.

ys jagan on nara lokesh

” జగన్ రెడ్డి కుప్పంలో ఎన్ని కుప్పిగంతులు వేసినా చివరికి భంగపాటు తప్పదు. పేదవాళ్ల నోటి కాడ ముద్ద లాక్కునే మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఆయన పేదవాళ్లకు అన్నం పెట్టడు.. ఇతరులను పెట్టనివ్వడు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లపై వైసీపీ మూకలు దాడులు చేస్తూనే ఉన్నారు. ఈరోజు కుప్పంలో చంద్రబాబు గారు ప్రారంభించబోయే అన్న క్యాంటీన్ ను వైసీపీకి గూండాలు ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నీ రౌడీయిజం పులివెందులలో చూపించుకో.. కుప్పంలో కాదు జగన్ రెడ్డి. కుప్పం జోలికి వస్తే వైసీపీ అల్లరి మూకల తాటతీస్తాం”. అంటూ ట్విట్ చేశారు.