గవర్నర్ తమిళసైకు మళ్లీ అవమానం

తెలంగాణ గవర్నర్ తమిళసైకు మళ్లీ అవమానం ఎదురైంది. మరోసారి గవర్నర్ టూర్‌లో ప్రోటోకాల్ వివాదం తెరపైకి వచ్చింది. గురువారం కాకతీయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి వరంగల్ జిల్లాకు గవర్నర్ వెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్ పర్యటనకు కలెక్టర్, కమిషనర్ దూరంగా ఉన్నారు. దీంతో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. కాగా, కేయూ గెస్ట్ హౌస్ దగ్గర ఆర్డీఓ, వీసీ గవర్నర్‌కు స్వాగతం పలికారు.

గవర్నర్ తమిళసై
గవర్నర్ తమిళసై

ఇటీవల గవర్నర్ పర్యటనల్లో తరచూ ప్రోటోకాల్ వివాదం తెరపైకి వస్తోంది. నిబంధనల ప్రకారం.. గవర్నర్ వస్తే కలెక్టర్లు, ఎస్పీలు స్వాగతం పలకాలి. కానీ ఈ మేరకు ప్రోటోకాల్ పాటించలేదనే విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్ అతిగా జోక్యం చేసుకుంటున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే తన పరిమితుల మేరకే తాను నడుచుకుంటున్నట్లు గవర్నర్ చెబుతున్నారు.