2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం : మంత్రి నిమ్మల

-

పోలవరం ప్రాజెక్టు డయా ఫ్రం వాల్ పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ప్రకటించినట్లుగానే జనవరిలోనే డయా ఫ్రం వాల్ పనులు మొదలుపెట్టాం అని తెలిపారు. అలాగే డయా ఫ్రం వాల్ నిర్మాణ పనులుసగం పూర్తవ్వగానే, ఈసిఆర్ఎఫ్ డ్యాం పనులు కూడా మొదలుపెడతాం. గతంలో 18 నెలలు కష్టపడి చంద్ర‌బాబు డయా ఫ్రం వాల్ నిర్మిస్తే, జగన్ విధ్వంశం చేశాడు. జగన్ తుగ్లక్ పాలన ఫలితంగా పోలవరం ప్రాజెక్ట్ మరో 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. పాత డయా ఫ్రంవాల్ బదులు కొత్త డయా ఫ్రం వాల్ నిర్మాణం వల్ల మరో 1000 కోట్లు అదనపు భారం పడింది.

ఏడేళ్ళ క్రితం పోలవరం నిర్వాసితులకు 800 కోట్లు పరిహారం అందించిన చంద్రబాబే మరలా ఇప్పుడు మరో 1000 కోట్లు పరిహారం అందించారు. 2019 ఎన్నికల ముందు పోలవరం నిర్వాసితులకు అదనంగా 10లక్షల పరిహారం అందిస్తానని చెప్పి,గెలిచాక జగన్ నిర్వాసితులను మోసం చేశాడు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే కేంద్రాన్ని ఒప్పించి రూ. 12159 కోట్లు తీసుకొచ్చాం. నిర్వాసితులకు న్యాయం జరిగేలా, ప్రాజెక్టు నిర్మాణంతో పాటే, సమాంతరంగా పునరావాసకాలనీలు సైతం నిర్మిస్తాం. పోలవరం ప్రాజెక్టు పనులను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసి, గోదావరి జలాలను ఇటు ఉత్తరాంధ్ర, అంటు రాయలసీమకు తీసుకెళ్తాం. 2027నాటికి పోలవరం పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తాం అని పేర్కొన్నారు మంత్రి.

Read more RELATED
Recommended to you

Exit mobile version