జగన్ మీద నారా లోకేష్ అనుచిత వ్యాఖ్యలు !

రాష్ట్ర ప్రజలకు సేవ చెయ్యాల్సిన ఒక మంత్రితో ప్రతిపక్ష నాయకుడ్ని బూతులు తిట్టించి ఆనంద పడిన రోజు జగన్ రెడ్డి కి చట్టాలు, మర్యాద, సాంప్రదాయాలు గుర్తు రాలేదా? అని నారా లోకేష్ ప్రశ్నించారు. రాజారెడ్డి రాజ్యాంగంలో బూతులు తిట్టిన వైకాపా నాయకుల పై చర్యలు ఉండవు అని రాసుకున్నారా? అని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. మేము కూడా తిట్టగలం కానీ మా పార్టీ సంస్కృతి అది కాదు అని చెప్పినందుకు టిఎన్ఎస్ఎఫ్ మాజీ అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తారా ? బ్రహ్మంకి పార్టీ అండగా ఉంటుందని అన్నారు.

మా కార్యకర్త విమర్శకి సమాధానం చెప్పే దమ్ములేక కేసులు పెట్టే జగన్ రెడ్డి నాయకుడో ? ధైర్యం లేని దద్దమ్మో వైకాపా శ్రేణులు తేల్చుకోవాలి అంటూ ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. టిఎన్ఎస్ఎఫ్ మాజీ అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం మంత్రి కొడాలి నాని వాడిన బాషనే వాడి ఆ తరువాత తాము కూడా ఇలా తిట్టగలం కానీ మా పార్టీ సంస్కృతి అది కాదు అని పేర్కొన్నారు. దీంతో ఆయన మీద వైసీపీ శ్రేణులు ఫిర్యాదు చేయడంతో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి.