మంత్రులూ కాస్కోండి.. మీకు కౌంట్‌డౌన్‌ షురూ : నారా లోకేశ్

-

వైసీపీ మంత్రులారా మీ టైం అయిపోయింది.. ఇక మీ కౌంట్డౌన్ షురూ అయినట్టేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి.. మేం మీలాగే చేస్తే వైసీపీ మీరంతా జైల్లోనే ఉంటారు. అధికారం లోకి వచ్చాక వడ్డీతో సహ చెల్లించే బాధ్యత నాదే అంటూ వైసీపీ నేతలపై లోకేశ్ ధ్వజమెత్తారు. స్వల్ప విరామం తర్వాత యువగళం పాదయాత్ర పునఃప్రారంభించిన ఆయన.. ఇవాళ డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం తాటిపాకలో ఆయన మాట్లాడారు.

“వ్యవస్థలను మేనేజ్‌ చేసి చంద్రబాబును జైల్లో పెట్టారు. నా పైనా సీఐడీ అధికారులు కేసులు పెట్టారు. ఒక్క ఆధారమూ చూపలేకపోయారు. ఏ తప్పూ చేయనందునే మళ్లీ ఇక్కడ నిలబడ్డాను. స్కిల్‌ కేసులో ఒక్క ఆధారమైనా చూపించారా? మా పార్టీ ఖాతాలోకి డబ్బు వచ్చిందని నిరూపించగలరా? నాపై ఆరు కేసులు పెట్టారు.. అయినా వెనక్కి తగ్గం. మంత్రులకు చెబుతున్నా.. మీకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. నాఅధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా.” అని లోకేశ్ ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news