తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి ‘ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తేహదుల్ ముస్లిమీన్ బహిరంగంగా మద్దతిస్తున్నట్లు కనిపిస్తుందిగా అన్ని మీడియా ప్రతినిధి ప్రశ్నకు ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తమ పార్టీ నుంచి బీఆర్‌ఎస్‌కు బహిరంగ మద్దతేమీ లేదని, అయితే.. తమ అభ్యర్థులు బరిలో లేని దగ్గర మామూ (కేసీఆర్)ను హ్యాట్రిక్ సీఎం చేయాలని చెబుతున్నామని ఆయన తెలిపారు.
అలాంటిది ఏమీ లేదు. మాపై తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎక్కడైతే తమ అభ్యర్థులు పోటీలో లేరో అక్కడ మాత్రమే మేం మమూ (కేసీఆర్)ను హ్యాట్రిక్ సీఎంను చేయాలని ప్రజలను కోరుతున్నాం. కాబట్టి, మేం వాళ్లపై పోటీ చేస్తున్నాం, వాళ్లు మాపై పోటీ చేస్తున్నారు.. అంతేతప్ప బీఆర్‌ఎస్‌కు మా బహిరంగ మద్దతేమీ లేదు’ అని అసదుద్దీన్ చెప్పారు. ప్రస్తుతం అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యల గురించి అందరూ చర్చించుకోవడం గమనార్హం.