చంద్రబాబు..ఓ నవరుప రాక్షసుడు అంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫైర్ అయ్యారు. సీఎం జగన్ పై దాడి జరిగిన సంఘటనపై స్పందిస్తూ చంద్రబాబు నాయుడు పై హాట్ కామెంట్ చేశారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. మానవ జన్మ ఎత్తిన నవరుప రాక్షసుడు చంద్రబాబు నాయుడని.. నరహంతకుడు చంద్రబాబు నాయుడంటూ ఫైర్ అయ్యారు.
175 సీట్లు గెలిచేస్తాడని కుట్రతోనే వారి మామ రామారావును వెన్నుపోటు పొడిచినట్లే జగన్మోహన్ రెడ్డి పై రాళ్లదాడి చేస్తున్నాడని.. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వీరందరూ కలిసి ఇంత దారుణానికి కారుకులయ్యారని మండిపడ్డారు. ఇటువంటి నరరూప రాక్షసుడు ఉన్నంతవరకు ఈ దేశం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం బాగుపడదన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నంతవరకు మా ఈ నరరూప రాక్షసుడు ప్రభుత్వం రాదని ఊహించి చంద్రబాబు నాయుడు కుట్రపాన్ని ఇలా రాళ్ల దాడి చేయించాడని ఆగ్రహించారు. నీకు పదవి దాహం తప్ప ఏదీ లేదు… నువ్వు నరరూప రాక్షసుడుగా అవతారం ఎత్తవే కానీ మానవ రూపం ఎత్తలేదని విరుచుకుపడ్డారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.