జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కు నక్సల్స్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీ రాజకీయ పార్టీలపై స్పందిస్తూ మావోయిస్టు కీలక నేత గణేష్ లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కు నక్సల్స్ వార్నింగ్ ఇచ్చారు. స్థిరమైన రాజకీయ విధానం, విశ్వసనీయత లేని వాడు పవన్ కళ్యాణ్, పార్టీ స్థాపించిన నాడు కమ్యూనిస్ట్ భావజాలం అని విమర్శలు చేశారు.

ఇప్పుడు బీజేపితో పొత్తు పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడని పవన్ కళ్యాణ్ పై ఆగ్రహించారు మావోయిస్టు నేత గణేష్. కాపుల చాటుగా రాజకీయ పబ్బం గడుపుతున్నాడని ఫైర్ అయ్యారు మావోయిస్టు నేత గణేష్. చేగువేరా నాకు ఆదర్శం, తుపాకీ పట్టుకొని అడువలకి వెళ్దాం అనుకున్నా అంటూ అరివీర భయంకర లెఫ్టిస్టులాగా బిల్డప్ ఇచ్చాడు అంటూ పవన్ పై మండిపడ్డారు మావోయిస్టు నేత గణేష్. పవన్ కళ్యాణ్‌కు స్థిరమైన రాజకీయ విధానం లేదు, అతడికి విశ్వసనీయత తక్కువ అన్నారు.