నేడు మూడో శ్వేత పత్రాన్ని విడుదల చేయనుంది తెలుగు దేశం పార్టీ కూటమి ప్రభుత్వం. ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేత పత్రాలను విడుదల చేసిన ప్రభుత్వం…మూడో శ్వేత పత్రంగా ఇంధన శాఖ పై విడుదల చేయనుంది తెలుగు దేశం పార్టీ కూటమి ప్రభుత్వం. ఇంధన శాఖపై వాస్తవ పరిస్థితులపై శ్వేత పత్రం విడుదల చేయనుంది.
గత ప్రభుత్వం ఇంధన శాఖ ను నిర్వీర్యం చేసిన తీరు వివరించనుంది ప్రభుత్వం. ఇంధన శాఖను గాడిలో పెట్టేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించనుంది ప్రభుత్వం. 2019 కి ముందు ఇంధన శాఖ పని చేసిన తీరును వివరించనుంది ఏపీ ప్రభుత్వం. అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుందని అధికారులు తెలిపారు. అన్ని జిల్లాల్లో ఉన్న నిల్వ కేంద్రాల్లోని ఇసుక డంప్‌ల నుంచి అందజేయనుంది.
సీనరేజ్ మినహా మరే ఇతర వ్యయాలు ప్రజలపై మోపకుండా ప్రభుత్వం ఇసుక అందజేయనుంది. ఈ మేరకు సీఎస్ నీరబ్‌కుమార్ ఇసుక స్టాక్స్ అన్నీ ఆయా జిల్లాల కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే.. కొన్ని రూల్స్ పెట్టారు. ఒక మనిషికి ఒక రోజుకి ఆధార్ కార్డు మేరకు 20 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇవ్వనున్నారు.