నెల్లూరు మేయర్ స్రవంతిని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. భార్య స్రవంతి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆమె భర్త జయవర్ధన్ నెల్లూరు కార్పొరేషన్ కమిషన్ వికాస్ మర్మత్ సంతకాలు చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు విజిలెన్స్ విచారణలో మేయర్ భర్త జయవర్ధన్ తప్పు చేసినట్లు తేలింది. ఈ ఫోర్జరీ సంతకం వ్యవహారంలో మేయర్ భర్త జయవర్ధన్ తో పాటు మరో ఏడుగురి పాత్ర ఉన్నట్లు గుర్తించారు.
అప్పటినుండి మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ఆయన చెన్నైలో ఉంటున్నట్లు సమాచారం. నెల్లూరులో నిబంధనల ప్రకారం నిర్మించని సుమారు 70 భవనాల తనక ఆస్తులను విడుదల చేశారు. ఇందుకోసం కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఈ వ్యవహారంలో కోట్లు దోచుకున్నారు అని నెల్లూరు ములుమూడికి చెందిన న్యాయవాది కాకు మురళి కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఇక ఈ కేసులో నేడు జయవర్ధన్ కి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. జయవర్ధన్ వెంటనే సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పలువురు వైసిపి కార్పొరేటర్లు భయాందోళనలో ఉన్నారు. ఇక జయవర్ధన్ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.