రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్ లైన్స్ నుండి ముంబై కు కొత్త ఎయిర్ బస్ సర్వీస్ ను ప్రారంభించారు ఎయిర్ పోర్ట్ అధికారులు. రాజమండ్రి నుండి ముంబై కు ఎయిర్ బస్ సర్వీసును ప్రారంభించారు ఎయిర్ పోర్ట్ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు. మొదటి సారి ప్రయోగాత్మకంగా ముంబై మహనగరానికి రాజమండ్రి నుండి ఎయిర్ బస్ సర్వీస్ ను నడుపనున్నారు ఎయిర్ పోర్ట్ అధికారులు.
ప్రస్తుతం రాజమహేంద్రవరం నుండి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కి 10 ఎయిర్ సర్వీసులు నడుస్తున్నాయి. అదనంగా నేటినుండి రాజమండ్రి నుండి ముంబై కు ప్రత్యేక సర్వీసును ఇండిగో ఎయిర్ లైన్స్ నుండి ప్రతి రోజు సాయంత్రం 6:45 కు నడుపనున్నట్లు వెల్లడించారు ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ జ్ఞానేశ్వర్ రావు. ఈ సర్వీస్ ను ప్రారంభించడానికి మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు,నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, ముప్పిడి వెంకటేశ్వర రావు విమానాశ్రయంకు వచ్చారు.