ఏపీలో కొత్త మద్యం ధరలు ఇవే…!

-

మద్యపాన నిషేధం విషయంలో ముందు నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ఏపీ సర్కార్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో మద్యం ధరలను పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. అలాగే క్రమంగా వైన్ షాపుల సంఖ్యను కూడా తగ్గించే ఆలోచన చేస్తుంది జగన్ సర్కార్. తాజాగా మద్యం ధరలను 25 శాతం మేర పెంచింది కొత్త ధరల ప్రకారం చూస్తే… రూ.120 కన్నా తక్కువ ధర ఉన్న క్వార్టర్‌ బాటిళ్లపై రూ.20 పెంచింది రాష్ట్ర ప్రభుత్వం.

హాఫ్ బాటిల్‌పై రూ.40, ఫుల్ బాటిల్‌పై రూ.80 పెంచుతూ నిర్ణయం తీసుకుంది సర్కార్. రూ.120-150 ధర ఉన్న క్వార్టర్‌ బాటిళ్లపై రూ.40 పెంచింది సర్కార్. మినీ బీర్‌పై రూ.20, ఫుల్ బీర్‌పై రూ.30 పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. ఏపీలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం షాపులు తెరుస్తుంది. షాపు వద్దకు కేవలం 5 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది.

మాస్క్ లేకపోతే మాత్రం మద్యం దుకాణాల వద్ద మద్యం ఇవ్వరు. గ్రీన్, ఆరెంజ్ జోన్ లో నేటి నుంచి మద్యం అమ్మకాలు మొదలు పెడుతుంది ప్రభుత్వం. ఇప్పటికే సామాజిక దూరానికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికి సంబంధించి అన్ని వైన్ షాపుల వద్ద మార్క్ లు గీసింది సర్కార్. అందులో నుంచుని మాత్రం లైన్ లో ఉండాల్సిన అవసరం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news