180 క్యాష్ బ్యాక్ కోసం 2 లక్షలు పోగొట్టుకున్నాడు…!

-

ఒక పక్క లాక్ డౌన్… చేయడానికి ఉద్యోగాలు లేవు. తినడానికి తిండి కూడా చాలా కష్టం అయ్యే పరిస్తితి. రోజు రోజుకి ఆర్ధిక వ్యవస్థ మరింత ఇబ్బంది గా మారుతుంది. ఈ తరుణంలో కొందరు చేస్తున్న పనులు ప్రజలను మరింత కష్టాలలోకి నెడుతున్నాయి. రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజలు నిత్యావసర సరుకుల కోసం బయటకు వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఆన్లైన్ లో సరుకులను ఆర్డర్ చేసుకుంటున్నారు.

దీనితో కొన్ని యాప్స్ నిత్యావసర సరుకుల కోసం ఆఫర్లు కూడా తమ వినియోగదారులకు ఇస్తున్నాయి. దీనిని కొందరు ఆసరాగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ఒక సంఘటన జరిగింది. ఒక వ్యాపారవేత్త పిల్లల కోసం ఏదో చిరు తిండి ఆర్డర్ చేసారు. అది 800 అయింది… ఆన్లైన్ లో పే చేయమని చెప్పారు. అది కొత్త యాప్… అంతకు ముందు రెండు సార్లు క్యాష్ బ్యాక్ వచ్చింది.

ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అందుకే మళ్ళీ అందులోనే ఆర్డర్ చేసాడు సదరు వ్యాపారవేత్త. అంతకు ముందు యాప్ లో వచ్చిన క్యాష్ బ్యాక్ కట్ కాగా 620 రూపాయలు కట్టమని వచ్చింది. దీనిని గూగుల్ పే తో కట్టమని చెప్పారు. వెంటనే అక్కడ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయగానే ఫోన్ కి ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ ని క్లిక్ చేయగా ఖాతాలో ఉన్న రెండు లక్షలు పోగొట్టుకున్నారు. దీనితో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.

బ్యాలెన్స్ చెక్ చేసుకోగా అది 10 రూపాయలు అని చూపించింది. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి వచ్చిన ప్రతీ ఆఫర్ మీద క్లిక్ చేసి మోసపోకుండా ఉండటం మంచిది అని సూచనలు చేస్తున్నారు. క్యాష్ బ్యాక్ కి అసలు కక్కుర్తి పడవద్దు అని, నమ్మకం ఉన్న యాప్స్ మీద మాత్రమే ఆర్డర్ లు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మధ్య ఈ కేసులు భారీగా పెరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news