అన్నవరంలో భక్తులకు కొత్త నిబంధన.. ఉల్లంఘిస్తే జరిమానా!

-

అన్నవరం వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్‌. అన్నవరం కొండపై మంగళవారం నుంచి ప్లాస్టిక్ ను నిషేధించినట్లు ఆలయ ఈవో ఆజాద్ తెలిపారు. కొండపై దుకాణాల్లో గాజు, మొక్కజొన్న గింజలతో తయారు చేసే సీసాలో మాత్రమే నీటిని విక్రయిస్తారన్నారు. గాజు సీసాలో నీరు కూలింగ్ ఛార్జీతో కలిపి రూ. 60 కి విక్రయిస్తారు. ఖాళీ బాటిల్ దుకాణంలో తిరిగి ఇస్తే రూ. 40 వెనక్కి వచ్చేస్తాయి.

మొక్కజొన్న గింజలతో తయారు చేసిన సీసాలో నీటిని రూ. 40 విక్రయించేందుకు అనుమతిచ్చాం. కొండపై పలు ప్రదేశాల్లో జల ప్రసాదం ప్లాంట్లు ఏర్పాటు చేశాం. మూత తెరవని శీతల పానీయాల సీసాలు మాత్రమే కొండపైకి అనుమతిస్తాం. వీటిల్లో తాగునీటిని తీసుకురాకుండా తనిఖీలు చేస్తాం. వివాహాల సమయంలో కూడా ఈ నిబంధనలు అమలవుతాయి. అతిక్రమిస్తే రూ. 500 జరిమానా విధిస్తాం అని ఆయన పేర్కొన్నారు. ఈవోతో సహా సిబ్బంది అంతా తప్పనిసరిగా ఈ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news