బ్రేకింగ్ : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

-

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. గుడ్లూరు మండలం తెట్టు గ్రామం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది. అయితే ఈ ప్రమాదంలో ఆయనకి ఏమీ కాలేదని తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఎమ్మెల్యే కారులో లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పిందని అంటున్నారు.

ఆ సమయంలో కారులో డ్రైవర్ మాత్రమే ఉండగా అతడు ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకోవడంతో ఎవరికీ ఎటువంటి ప్రాణ హాని లేదు. అయితే కారు ప్రమాద తాకిడికి కారు ముందు భాగం మాత్రం నుజ్జు నుజ్జు అయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అనారోగ్య రీత్యా ఇంట్లోనే ఉన్నారు. ఎమ్మెల్యే కారు విజయవాడ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version