బ్రేకింగ్: బెజవాడలో 4 గంటలకే సరిపడా ఆక్సీజన్

విజయవాడలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపధ్యంలో ఆక్సీజన్ కొరత చాలా దారుణంగా ఉంది. రోజు రోజుకి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం విజయవాడలో కేవలం 4 గంటలకు సరిపడా మాత్రమే ఆక్సీజన్ ఉందని తెలుస్తుంది. కొన్ని ఆస్పత్రుల్లో 4 గంటలకు మాత్రమే ఆక్సీజన్ ఉందని బోర్డ్ లు కూడా పెడుతున్నారు.

వెంటిలేటర్ లపై వందలాది మంది రోగులు ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సీజన్ లేక భారీగా ప్రాణాలు పోతున్నాయి. ఈ తరుణంలో కేంద్రం రంగంలోకి దిగింది. ఇప్పుడు విజయవాడలో అలాంటి పరిస్థితి ఉండటంతో ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు.