ప్రజలకు అబద్ధాలు దువ్వెందుకు దువ్వూరి కృష్ణ వైసిపి నేతలా మాట్లాడారు – పట్టాభి

-

ప్రజలకు అబద్ధాలు దువ్వెందుకు దువ్వూరి కృష్ణ వైసీపీ నేతలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి.ఆర్బీఐ, కేంద్ర ఆర్ధిక కార్యదర్శులు ఏపీలో శ్రీలంక లాంటి ఆర్ధిక పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారని అన్నారు.టిడిపి నాయకులు మాట్లాడితే మాత్రం వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారని అన్నారు. దువ్వూరి కృష్ణ
భాధ్యతాయుతమైన పదవిలో ఉండి రాజకీయాలు మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.శ్రీలంకతో ఏపీని పోల్చవద్దంటూ.. ఈయన మాత్రం కేంద్ర గణాంకాలతో రాష్ట్ర గణాంకాలను పోల్చి మాట్లాడారని అన్నారు.

తెలుగుదేశం హయాంలో 29 శాతం మించని డెట్ జీఎస్డీపీ రేషియో, వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి గరిష్టంగా 35 శాతంకు ఎందుకు పెరిగిందో దువ్వూరి కృష్ణా, సజ్జల చెప్పాలని డిమాండ్ చేశారు.టీడీపీ ఐదేళ్లలో కేవలం 173 రోజులు మాత్రమే ఓడికి వెళితే, వైసీపీ మూడేళ్లలోనే 326 రోజులు ఓడీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అని ప్రశ్నించారు.ఈ ఆర్ధిక సంవత్సరంలో మొదటి మూడున్నర నెలలోనే దేశంలోనే అత్యదికంగా రూ. 27,890 కోట్లు ఆర్బీఐ బాండ్ల వేలంలో రుణాలు సేకరించాల్సిన గత్యంతరం దేనికి? అని మండిపడ్డారు.

గత మూడు నెలలుగా దేశంలో కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కాగ్ నివేదికలు వెబ్ సెబ్ లో ఎందుకు పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఫిబ్రవరి 2022 లో రూ. 51 వేల కోట్లుగా ఉన్న ద్రవ్యలోటు ఒక్క నెలలోనే మార్చి 2022 కి రూ. 25 వేల కోట్లకు ఎలా పడిపోయింది…? ఇవి తప్పుడు లెక్కలు కాదా? అంటూ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news