రాజంపేట మండలం పులపత్తూరులో వరద బాధితులతో మాట్లాడారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే అన్నమయ్య నిర్మాణం త్వరలో చేపడతాం అని పవన్ ప్రజలతో అన్నారు. నేతల స్వార్థం వల్ల అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది. కానీ నేను మీకు మాట ఇస్తున్నా. మీ సమస్యను నేను పర్యవేక్షిస్తా. ఉన్నతాధికారుల బృందం పంపిస్తా. సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరిస్తా అని పేర్కొన పవన్.. ఇప్పటికిప్పుడు చేయాల్సిన పనులేంటో రిపోర్ట్ అధికారులను ఆదేశించారు.
మీరు కొంచెం సమయం ఇస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తాం అని తెలిపారు. అలాగే కొంత మంది ఇసుక అక్రమ రవాణా కోసం డ్యాం కొట్టుకుపోయింది. అయితే రాజకీయ నాయకులు వస్తారు పోతారు. కానీ తప్పులు జరగకుండా అధికారులు చూసుకోవాలి. ప్రభుత్వ భూములు ఎక్కడైనా అన్యాక్రాంతమైతే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇక గ్రామ సభల్లో వచ్చే ఫిర్యాదులను డిప్యూటీ సీఎం ఆఫీస్ పర్యవేక్షిస్తుంది అని పవన్ కళ్యాణ్ తెలిపారు.