నాది YSR రక్తం..మీకు దమ్ముంటే మా అమ్మను అడగండి – షర్మిల !

-

నాది YSR రక్తం…రాజశేఖర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డి కాకుండా ఎలా పోతుందంటూ ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కొడుక్కి వైఎస్ రాజా రెడ్డి అని పేరు పెట్టుకున్నానని తెలిపారు.

ys sharmila counter to cm jagan

అక్రమంగా సంపాదించుకోడానికి నా భర్తతో జగన్ వద్దకు వెళ్ళానని అభాండాలు వేస్తున్నారని… నేను ఏమీ ఆశించి ఈరోజు వరకూ నా అన్న వద్దకు వెళ్ళలేదు… దానికి సాక్ష్యం మా అమ్మే అన్నారు. దీనిపై నమ్మకం లేకపోతే…మీకు దమ్ముంటే మా అమ్మను అడగండన్నారు.

ప్రభుత్వాలు పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నాయి….సమాజంలో సోషల్ జస్టిస్ వంద శాతం లేదని విమర్శలు చేశారు.ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి గుండు కోట్టి అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వని పార్టీలకు మద్దతు ఇవ్వమని ప్రజలు ప్రమాణం చేయాలని డిమాండ్‌ చేశారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news