ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘పాపం పసివాడు’’ అంటూ సినిమా పోస్టర్ తో జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రోజున బాపట్ల జిల్లా నిజాంపట్నంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులు విడుదల కార్యక్రమంలో పవన్ కల్యాణ్, చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని సీఎం జగన్ పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ జనసేనాని ట్వీట్ చేశారు.
“మన ఏపీ సీఎంతో ఎవరైనా ఈ సినిమా(పాపం పసివాడు) తీస్తారని ఆశిస్తున్నాను. అతను చాలా అమాయకుడు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మార్పు మాత్రమే అవసరం ఉంది. అతని చేతిలో ‘సూట్‌కేస్’కి బదులుగా, అతను అక్రమంగా సంపాదించిన సంపద కోసం మనీలాండరింగ్‌ను సులభతరం చేసే ఎక్కువ ‘సూట్‌కేస్ కంపెనీలను’ ఉంచండి. ప్రియమైన ఏపీ సీఎం.. మీరు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య లేదా కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి కాదు. మీ అక్రమ సంపాదనతో, ప్రజలపై మీరు సాగిస్తున్న హింసతో ‘వర్గ యుద్ధం’ అనే పదాన్ని ఉచ్చరించే హక్కు కూడా మీకు లేదు.” అంటూ పవన్ ట్వీట్ చేశారు.