చాలా మంది వడ దెబ్బ కారణంగా మరణిస్తున్నారు. అయితే వడ దెబ్బ వలన కలిగే లక్షణాలు ఏంటి ఎలా గుర్తించొచ్చు…? ఎటువంటి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది..? ఇలా దీనికి సంబంధించి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం… నిజానికి హీట్ స్ట్రోక్ (వడ దెబ్బ) అనేది ప్రమాదకరమే దీనిని అస్సలు లైట్ తీసుకోకూడదు. ఒకవేళ కనుక తేలికగా దీనిని తీసుకుంటే ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎండాకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి ఆరోగ్యం పాడైతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎండ వేడి వలన ఫలితం తీవ్రంగా ఉంటుంది. వడదెబ్బ వలన మరణించొచ్చు లేకపోతే బ్రెయిన్ కి సమస్య కలగొచ్చు. ఇతర ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ప్రమాదంలో పడొచ్చు. 50 ఏళ్లు దాటిన వాళ్ళలో వడదెబ్బ సమస్య ఎక్కువగా వస్తుంది. అలానే అథ్లెట్స్ కి కూడా ఈ సమస్య కలగొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది.
వడదెబ్బ లక్షణాలు:
బాడీ టెంపరేచర్ 104f దాటి ఉంటుంది. అలానే వడదెబ్బ రాగానే మొట్టమొదటి లక్షణం ఏంటంటే నీరసం లేదా కళ్ళు తిరగడం. ఇతర లక్షణాలు కూడా కనబడతాయి. మరి అవేమిటో కూడా చూసేద్దాం.
దడ పుట్టించే విధంగా తలనొప్పి
వికారం
బలహీనత
వేడి ఉన్నప్పటికీ చెమట లేకపోవడం
పొడి చర్మం
కండరాల లేదా తిమ్మిరి
వాంతులు
గుండె వేగంగా కొట్టుకోవడం
గందరగోళం
అయోమయ స్థితి లేదా అస్థిరత వంటి ప్రవర్తనా మార్పులు
మూర్ఛ
అపస్మారక స్థితి
వడదెబ్బకి ప్రథమ చికిత్స:
వడదెబ్బ తగిలిన వ్యక్తిని మొదట చల్లటి ప్రదేశంలోకి తీసుకువెళ్లాలి నీడగా ఉన్నచోట కూర్చో పెట్టాలి. ఎక్స్ట్రా బట్టల్ని తొలగించాలి.
బాడీ టెంపరేచర్ తగ్గేటట్టు చూసుకోవాలి. బాడీ టెంపరేచర్ ఎంత ఉందో చూడాలి.
తడి గుడ్డతో బాడీని తుడిస్తే ఒళ్ళు చల్లబడుతుంది వేడి తగ్గుతుంది.
ఐస్ ప్యాక్ వంటివి కూడా పెట్టొచ్చు. మొదటి టెంపరేచర్ బాగా తగ్గేటట్టు చూసుకోవాలి బాగా పెద్ద వాళ్ళకి చిన్న పిల్లలకి ఐస్ ని పెట్టకండి దాని వలన ఇబ్బంది పడాల్సి వస్తుంది.
వడదెబ్బ రిస్క్ ఫ్యాక్టర్స్:
నీళ్లు ఎక్కువగా తాగనివాలలో ఈ సమస్య మరింత ఇబ్బందికరంగా మారుతుంది.
ఎక్కువ ఆల్కహాల్ ని తీసుకునే వాళ్ళకి కూడా ప్రమాదం కలుగవచ్చు.
అనారోగ్య సమస్యల వాళ్లకి కూడా ఇబ్బంది ఎక్కువ ఉంటుంది.
షుగర్, బీపీ వాళ్ళకి కూడా ఎక్కువ రిస్క్ ఉంటుంది.
వడదెబ్బ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి..?
వడదెబ్బ తగలకుండా ఉండాలంటే డిహైడ్రేషన్ సమస్య లేకుండా ఎక్కువ నీళ్లు తీసుకుంటూ ఉండాలి. ఎండలో బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. వ్యాయామం చేసే వాళ్ళు నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
వదులుగా ఉండే దుస్తులను ధరించాలి లైట్ కలర్ బట్టల్ని వేసుకోవడం మంచిది.
ఎండలో బయటకు వెళ్లే పనుల్ని వాయిదా వేసుకోండి.
కెఫీన్, ఆల్కహాల్ కి దూరంగా ఉండండి. నీళ్లు, నీళ్లు ఎక్కువగా ఉండే పండ్లు కూరలు తీసుకుంటూ ఉండండి.
హార్ట్ కిడ్నీ లివర్ సమస్యలతో బాధపడే వాళ్ళు ఎంత నీళ్లు తీసుకోవాలి అనేది డాక్టర్ని అడిగి తెలుసుకోండి.