వైఎస్ షర్మిలకు రక్షణ కల్పించే బాధ్యత మాది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏలూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు సరిగా అమలు చేయలేదని ఆగ్రహించారు. కుటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేసి చూపుతోందని తెలిపారు.
దీపం పథకం కింద ఏడాదికి 2,684 కోట్లు, ఐదేళ్లకు 13,425 కోట్లు ఖర్చు చేస్తుందని హామీ ఇచ్చారు. జనసేన కార్యకర్తలు రోడ్లెక్కి పోరాటం చేయడంతో ప్రజల్లో ధైర్యం వచ్చిందన్నారు. 14ఏళ్ల క్రితం ఐ ఎస్ జగన్నాధపురం ఆలయానికి వచ్చాను..ఇక్కడ స్వయంబుగా వెలసిన లక్ష్మి నరసింహ స్వామినీ ఎప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటానని తెలిపారు. ఆ నాయకుడి సొంత సోదరి తన ప్రాణాలకు రక్షణ కావాలంటోందని… ఆమెకు రక్షణ కల్పించే బాధ్యత మా ప్రభుత్వానిదని తెలిపారు. షర్మిల….రేపు మాపై రాజకీయ విమర్శలు చేసినా ఆమెకు అండగా మేముంటామని ప్రకటించారు పవన్.