నాకు వైసీపీ నుంచి ప్రాణహాని ఉందంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యవర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఈ కామెంట్స్ చేశారు. నాకు ప్రాణహాని ఉంది, ప్రత్యేక సుఫారీ ఇచ్చారని వెల్లడించారు.
నేను బ్రతికి ఉండాలి కాబట్టి సెక్యూరిటీ అన్నారు. వాళ్లకు ఇబ్బంది ఉన్నప్పుడు నన్ను బ్రతకనిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. 2019 లో వైసిపి రాకపోతే పవన్ కళ్యాణ్ ని చంపేద్దామని అనుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అలాంటి రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి ఇంటిలిజెన్స్ వారు పంపించారన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల 34 సీట్ల లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదని కోరారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.