నేను హోం మంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయి : పవన్ కళ్యాణ్

-

30 వేలు మంది ఆడ పిల్లలు మిస్ అయితే గత ప్రభుత్వంలో సీఎం మాట్లాడలేదు. అత్యాచారాలు చేసే నీచులు, దుర్మార్గులును ఏమి చేయాలి. గత ప్రభుత్వం తాలూకా వారసత్వం కొనసాగుతుంది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం లో నన్ను చంపేస్తామంటే ఒక్క పోలీస్ కూడా మాట్లాడలేదు. గతంలో పోలీసులుకి బాధ్యత లేదు. గత ప్రభుత్వం లో రేప్ లు చేసే వారిని ఎంకరేజ్ చేశారు.

ఇక నేను హోం మంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయి. విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోం మంత్రి గా నేను బాద్యతలు తీసుకుంటాను. ఈ విషయంలో హోం మంత్రి అనిత రివ్యూ చేయాలి. లా అండ్ ఆర్డర్ చాలా కీలకం..పోలీసులు మరచిపోకండి. మా బంధువు అంటే మడత పెట్టి కొట్టండి. ఆడ పిల్లలు రేప్ చేస్తే కులం ఎందుకు వస్తుంది. ఇండియన్ పీనల్ కోడ్ పోలీసులు కి ఏమి చెప్తుంది. బయటకు వస్తే ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు. కాబట్టి డీజీపీ బాధ్యతలు తీసుకోవాలి. పదవి ఉండొచ్చు లేకపోవచ్చు ఐ డోంట్ కేర్.. కానీ గత ప్రభుత్వంలో లా పోలీసులు అలసత్వం గా ఉండకండి అని పవన్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news