జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ భీమిలి ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టూరిజం ముసుగులో ఉత్తరాంధ్రలో అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. ఈ అక్రమాల గురించి కేంద్ర పర్యావరణ శాఖ దృష్టికి తీసుకెళ్తామన్నారు పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్రలో దోపిడి చేసి అభివృద్ధి చెందుతున్నారే తప్ప ఇక్కడి వారి గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదని పేర్కొన్నారు పవన్. కొద్ది రోజుల్లో ఉత్తరాంధ్ర చేజారిపోతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లా నుంచి దాదాపు రూ.20లక్షల కోట్ల విలువైన భూములు దోపిడికి గురయ్యాయని.. బయటి నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులే దోపిడి చేశారని ఇటీవల యూపీఎస్సీ మాజీ సభ్యులు, ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ కె.ఎస్.చలం ఆరోపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు హైదరాబాద్ తో పాటు పలు పట్టణాలకు వలస వెళ్ళుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర దోపిడి, ఉత్తరాంధ్ర విధ్వంసం ఆగాలి అని కోరుతున్నట్టు తెలిపారు పవన్ కళ్యాణ్.